“మిస్టర్ బచ్చన్” షూటింగ్ పై హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్!

“మిస్టర్ బచ్చన్” షూటింగ్ పై హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Published on Apr 18, 2024 12:00 AM IST

డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో, మాస్ మహారాజ రవితేజ (Raviteja) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ (Mr Bachchan). ఈ చిత్రం లో భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన షూటింగ్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదిక గా కీలక అప్డేట్ ను అందించారు.

30 రోజుల పాటు జరిగిన లాంగ్ అండ్ ఇంటెన్స్ షెడ్యూల్ కి సంబందించిన షాట్ ను పోస్ట్ చేశారు. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యింది అని, త్వరలో హైదరాబాద్ లో కలుద్దాం అని అన్నారు. అంతేకాక ఈ షెడ్యూల్ లో సహకరించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకి థాంక్స్ తెలిపారు హరీష్. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు