ఏప్రిల్ లో సెట్స్ మీదకి “సలార్ 2”

ఏప్రిల్ లో సెట్స్ మీదకి “సలార్ 2”

Published on Mar 3, 2024 8:03 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం పార్ట్ 2 కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రం లో కీలక పాత్రలో నటించిన బాబీ సింహ ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సలార్ 2 ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిపారు. దీనికోసం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు అని అన్నారు. ఇది రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. శృతి హాసన్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు