“హరిహర వీరమల్లు” నుండి భారీ అప్డేట్ రెడీ!

“హరిహర వీరమల్లు” నుండి భారీ అప్డేట్ రెడీ!

Published on Apr 30, 2024 11:27 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కృష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు (HHVM). ఈ చిత్రం ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకోవాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన పొలిటికల్ అజెండా కారణం గా వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రం నుండి చిత్ర యూనిట్ ఆసక్తికరమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో చేయడం జరిగింది. ఈగల్ మరియు ఫైర్ సింబల్స్ తో ఉన్న పోస్ట్ అది.

అయితే ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను గతంలో విడుదల చేయనున్నట్లు పలు వార్తలు వచ్చాయి. ఈ అప్డేట్ అదే అయ్యి ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. అది కాకుండా పోస్టర్ తో రిలీజ్ డేట్ ను ప్రకటించండి అంటూ అభిమానులు కొంతమంది కోరుతున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం లో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు