టాక్ : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ వాటి పై ఆధారపడి ఉందా ?

టాక్ : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ వాటి పై ఆధారపడి ఉందా ?

Published on Feb 25, 2024 10:01 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గ్రాండ్ లెవెల్లో రూపొందుతున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీ యొక్క రిలీజ్ కి సంబందించి కొన్నాళ్లుగా పలు వార్తలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం గేమ్ ఛేంజర్ ని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటికే ఆ రెండు నెలల్లో పవన్ కళ్యాణ్ ఓజి, ఎన్టీఆర్ దేవర సినిమాలు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసాయి. కాగా ఒకవేళ వాటి రిలీజ్ డేట్స్ మారే అవకాశం కనుక ఉంటే, దానిని బట్టి గేమ్ ఛేంజర్ రిలీజ్ ప్లానింగ్ ఉంటుందని అంటున్నారు. అయితే పక్కాగా దీనికి సంబంధించి ఆ మూవీ యొక్క మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు