ఓటిటి రిలీజ్ డేట్ పిక్స్ చేసుకున్న అజయ్ దేవగన్ లేటెస్ట్ చిత్రం!?

ఓటిటి రిలీజ్ డేట్ పిక్స్ చేసుకున్న అజయ్ దేవగన్ లేటెస్ట్ చిత్రం!?

Published on Apr 13, 2024 10:32 AM IST

బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “మైదాన్”. ఒక మంచి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ని అందుకుంది. అయితే ఈ ఏడాదిలో అజయ్ దేవగన్ నుంచి ఇది ఈ రెండో సినిమా కాగా దీనికి ముందు వచ్చిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రమే “సైతాన్”. దర్శకుడు వికాస్ బాహి తెరకెక్కించిన ఈ చిత్రంలో నటి జ్యోతిక కూడా ముఖ్య పాత్రలో నటించింది.

మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ ని అందుకోగా ఇప్పుడు ఫైనల్ గా ఓటిటిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ మే 3 నుంచి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంతోనే జ్యోతిక బాలీవుడ్ డెబ్యూ ఇవ్వగా వెర్సటైల్ నటుడు మాధవన్ ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు