200 కోట్లు కొట్టేసిన అజిత్ సినిమా!?

200 కోట్లు కొట్టేసిన అజిత్ సినిమా!?

Published on Apr 18, 2025 2:01 AM IST

థలా అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “గుడ్ బ్యాడ్ అగ్లీ”. అజిత్ అభిమానులకి ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమాని ఆధిక్ అందించగా ఇపుడు అభిమానులు థియేటర్స్ లో పండుగ చేసుకుంటున్నారు. మరి డే 1 నుంచి సాలిడ్ వసూళ్లు అందుకుంటున్న ఈ చిత్రం ఒక్క తమిళ నేల పైనే కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.

ఇక ఇపుడు వారం రోజుల రన్ ని పూర్తి చేసేసుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ ని దాటేసినట్టుగా కోలీవుడ్ పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. మరి మేకర్స్ కూడా ఈ సినిమా వసూళ్లు కోసం పెద్దగా రివీల్ చేయడం లేదు కానీ తమిళ్ సహా ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ బాగానే రన్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఓవరాల్ ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు