అఖిల్ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ?

Akhil1

‘అఖిల్’ చిత్రం తో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు అక్కినేని అఖిల్. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అఖిల్ కు గ్రాండ్ ఎంట్రీ ని ఇవ్వలేకపోయింది. ఇక ఈ చిత్రం తరువాత అక్కినేని కుటుంభానికి ‘మనం’ అనే గుర్తుండిపోయే సినిమాను ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ‘హలో’ చిత్రంలో నటించాడు. ఈచిత్రం కూడా అనుకున్నంత విజయాన్ని అందించలేక పోయింది. ఇక ఇప్పుడు అఖిల్ ఎలాగైనా భారీ విజయాన్ని సాధించాలని ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి తో తన 3వ చిత్రాన్ని చేస్తున్నాడు.

ఈ చిత్రం ప్రస్తుతం సెట్స్ మీద ఉండగానే తన 4వ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అఖిల్. ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి అన్నయ్య సత్య ప్రభాస్ దర్శకత్వంలో తరువాతి చిత్రాన్ని చేయనున్నాడని సమాచారం. సత్య ప్రభాస్ చెప్పిన కథ బాగా నచ్చి ఈ చిత్రాన్ని ఓకే చేశారట అఖిల్. త్వరలోనే ఈ చిత్రం ఫై అధికారిక ప్రకటన వెలుబడే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version