ఓల్డ్ లుక్ లో కనిపించబోతున్న అఖిల్ ?

ఓల్డ్ లుక్ లో కనిపించబోతున్న అఖిల్ ?

Published on Feb 3, 2026 12:00 AM IST

Akhil

యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా కోసం అఖిల్ ఓల్డ్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ లో అఖిల్ 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తాడట. సినిమాలో నాలుగు నిమిషాలు పాటు ఈ లుక్ ఉంటుందట. మరి ఈ లుక్ లో అఖిల్ ఎలా ఉండబోతున్నాడో చూడాలి. కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

తాజా వార్తలు