చరణ్ నుంచి మరో బిగ్ అప్డేట్ ఉంటుందా.?

Published on Mar 21, 2021 3:59 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి మరియు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివలతో రెండు భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే వీటిలో తారక్ తో చేస్తున్న “రౌద్రం రణం రుధిరం” సినిమాలో తన పుట్టినరోజు సందర్భంగా ఒక పవర్ ఫుల్ పోస్టర్ ఇప్పటికే రెడీ అయ్యి వస్తుందని కన్ఫర్మ్ అయ్యింది. మరి మెగాస్టార్ చిరు తో చేస్తున్న “ఆచార్య”లో కూడా చరణ్ ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాడు.

మరి ఈ రోల్ కు సంబంధించి మేకర్స్ ఏదొక అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా బజ్ వినిపిస్తుంది పైగా సాధ్యం కూడా ఉంది. మరి అయితే అది వారు పోస్టర్ ను ప్లాన్ చేస్తున్నారా లేదా జస్ట్ గ్లింప్ల్స్ లాంటిది ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :