“కేజీయఫ్ 2” సాలిడ్ అప్డేట్ ఆ డేట్ న..?

Published on Mar 6, 2021 7:03 am IST

ఇప్పుడు ఇండియన్ ప్రేక్షకులు అంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి.

ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడు అనే బిగ్ అప్డేట్ ను అలాగే టీజర్ ను కూడా మేకర్స్ విడుదల చేసేసారు. కానీ ఇదే మార్చ్ నెలకు మరియు “కేజీయఫ్ చాప్టర్ 2″ఓ బంధం ఉందని తెలుస్తుంది. ఈ చిత్రం షూట్ ను గత 2019 మార్చ్ 13న మొదలు పెడుతున్నామని బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ మేకర్స్ ఇచ్చారు.

అలాగే అక్కడ నుంచి సరిగ్గా ఏడాదికి 2020 మార్చ్ 13న మొదటగా ఫిక్స్ చేసిన రిలీజ్ డేట్ ను ప్రకటించి అప్పటికి సెన్సేషన్ ను నమోదు చేశారు. మరి అలా ఈసారి కూడా ఏమన్నా ఉంటుందా అని కన్నడ వర్గాలు ఓ టాక్ ను రైజ్ చేసాయి. మరి ఆ లెక్కన ఈ డేట్ కు కేజీయఫ్ మేకర్స్ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఉంటుందా ఉండదా అన్నది చూడాలి మరి.

సంబంధిత సమాచారం :