“RRR” నుంచి మరో మోస్ట్ అవైటెడ్ పోస్టర్ రానుందా.?

“RRR” నుంచి మరో మోస్ట్ అవైటెడ్ పోస్టర్ రానుందా.?

Published on Mar 28, 2021 9:42 AM IST

ఇండియన్ సినిమా వద్ద భారీ అంచనాలు సెట్ చేసుకున్న భాయీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో ఒకటైన “రౌద్రం రణం రుధిరం” నుంచి బిగ్ అప్డేట్స్ తో మళ్ళీ ఈ చిత్రం మంచి హైప్ తెచ్చుకుంటుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పుట్టినరోజు సందర్భంగా తాను చేస్తున్న సీత పాత్ర పోస్టర్ ను రివీల్ చేసారు.

మరి మొన్ననే చరణ్ చేస్తున్న సీతారామరాజు పోస్టర్ ను ఊహించని లుక్ లో తన బర్త్ డే గిఫ్ట్ గా వదిలారు. మరి ఇప్పుడు కొన్ని రోజుల గ్యాప్ లోనే మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ రావడం కన్ఫర్మ్ అనుకుకోవచ్చు. ఈ చిత్రంలో ఆలియా తో పాటుగా బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వచ్చే ఏప్రిల్ 2నే అజయ్ పుట్టినరోజు ఉంది. సో ఆ పోస్టర్ ను కూడా ఆశించొచ్చు. ఎప్పటి నుంచో అజయ్ లుక్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి ఈ పోస్టర్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు