“కన్నప్ప” లో మరో స్టార్ నటి!?

“కన్నప్ప” లో మరో స్టార్ నటి!?

Published on Apr 18, 2024 9:53 AM IST


టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ సహా తన డ్రీం ప్రాజెక్ట్ కూడా కాగా ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా ఒక బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ఇది మారుతూ వెళ్తుంది. అయితే రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్నట్టుగా వార్తలు రాగా కన్నప్ప సినిమా పేరు మరింత స్థాయిలో వినిపించింది.

అయితే లేటెస్ట్ గా సినిమా భారీ తారాగణంలో మరో స్టార్ నటి పేరు బయటకి వచ్చింది. ఆమె ఎవరో కాదు సౌత్ ఇండియా స్టార్ నటి కాజల్ అగర్వాల్. ఈమె కూడా ఇప్పుడు ఈ సినిమాలో కనిపిస్తుంది అని కొన్ని రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఇది దాదాపు నిజం అన్నట్టుగానే వినిపిస్తుంది. ఆల్రెడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక కాజల్ పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు