“విడుదల 2” లో మరో వెర్సటైల్ నటుడు!?

“విడుదల 2” లో మరో వెర్సటైల్ నటుడు!?

Published on May 18, 2024 9:04 AM IST


తమిళ సినిమా ప్రముఖ దర్శకుల్లో తనదైన సహజ చిత్రాలతో అదరగొట్టే వెర్సటైల్ దర్శకుడు వెట్రిమారన్ రీసెంట్ గా చేసిన సాలిడ్ హిట్ చిత్రమే “విడుదల”. తమిళ నాట విడుతలై గా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టి హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో నటించగా టాలెంటెడ్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించాడు.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలమే అయ్యింది కానీ విడుదల పార్ట్ 2 మాత్రం ఇంకా రాలేదు. చాలా త్వరగానే పూర్తి కావాల్సిన ఈ చిత్రం బడ్జెట్, స్క్రిప్ట్ లో మార్పులు మూలాన మరింత ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక ఇదిలా ఉండగా కోలీవుడ్ వర్గాల్లో ఓ ఫ్రెష్ బజ్ బయటకి వచ్చింది.

దీని ప్రకారం పార్ట్ 2 లో మరో టాలెంటెడ్ వెర్సటైల్ నటుడు అలాగే దర్శకుడు ఎస్ జే సూర్య కూడా కనిపించనున్నాడని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇక ఈ అవైటెడ్ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకులు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు