తన గంభీరమైన గొంతు తోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడే అర్జున్ దాస్. తమిళ్ సహ తెలుగులో కూడా తనకి మంచి ఆదరణ ఉంది. అయితే ఇటీవల ఓజి సినిమాలో సాలిడ్ రోల్ దక్కించుకున్న తను ఇప్పుడు తమిళ్ లో బిజీగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో అర్జున్ దాస్ చేసిన ఓ లవ్ బ్రేకప్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నువ్ ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే వాళ్ళు నిన్ను వదిలేస్తారు. అసలు ఎలా ఒకరు మూవ్ ఆన్ అవుతారు అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నిజంగానే అర్జున్ దాస్ కి బ్రేకప్ అయ్యిందా లేక ఏదన్నా సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేస్తున్నారా అంటూ మరికొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో దీనిపై డైరెక్ట్ అర్జున్ దాస్ నుంచే ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
