బాలీవుడ్ కి వెళుతున్న పవన్ చిత్రం…?

బాలీవుడ్ కి వెళుతున్న పవన్ చిత్రం…?

Published on Jul 29, 2019 7:19 AM IST

అక్షయ్ కుమార్ రెండు రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా తన కొత్త మూవీకి సంబంధిచిన పోస్టర్ ని విడుదల చేశాడు. నుదిటి ఫై విబూది,మెడలో గోల్డ్ చైన్లు,మోకాళ్ళ పైవరకు ఉన్న నల్లని పంచె కట్టుకొని ఉన్న అక్షయ్ చేతిలో మార్షల్ ఆర్ట్స్ ఆయధమైన నాన్ చాక్ ఉండటం ఆసక్తిని రేపుతోంది. “బచ్చన్ పాండే” పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అయివుంటుందని పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది.

ఫర్హాద్ సామ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా నిర్మిస్తుండగా, వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.ఐతే ఈ మూవీ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడికి రీమేక్ అట. కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో పవన్, శృతి హాసన్ జంటగా 2017లో విదులైన కాటమరాయుడు ఫ్యాన్స్ కి మంచి యాక్షన్ ఫీస్ట్ అందించింది.

కాటమరాయుడు సినిమా తల అజిత్ తమిళ చిత్రం వీరం కి తెలుగు రీమేక్. ఇప్పుడు అక్షయ్ కుమార్ ఈ చిత్రాన్ని బచ్చన్ పాండే గా హిందీలో రీమేక్ చేస్తున్నారు. హిందీ నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్లో పలు మార్పులు కూడా చేస్తున్నారని సమాచారం. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అక్షయ్ నటించిన తాజా చిత్రం ‘మిషన్ మంగళ్’ ఆగస్టు 15న విడుదల కానుండగా, హౌస్ ఫుల్ 4, సూర్యవంశీ,లక్ష్మీ బాంబ్, గుడ్ న్యూస్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు