‘శాకుంతలం’కు బ్రేక్.. రీజన్ అదే !

‘శాకుంతలం’కు బ్రేక్.. రీజన్ అదే !

Published on Apr 13, 2021 7:05 PM IST

shakuntalam
భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్, సమంత అక్కినేని టైటిల్ రోల్ తో ప్రస్తుతం చేస్తోన్న ‘శాకుంతలం’ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. కాగా గుణశేఖర్ ‌కి కోవీడ్-19 పాజిటివ్ రావడంతో.. ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ తాత్కాలికంగా పోస్ట్‌పోన్ చేసినట్టు తెలుస్తోంది. శకుంతలగా నటిస్తోన్న సమంత అక్కినేని సరసన మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమా ఇద్దరు ప్రేమికుల అందమైన దృశ్య కావ్యం అంటున్నాడు గుణశేఖర్. నాటి శాకుంతల-దుష్యంతుల ప్రేమకావ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాకి మాటలు సాయి మాధవ్ బుర్రా అందించాడు. గుణ టీం వర్క్స్ బ్యానర్‌ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పిస్తున్నాడు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో విఎఫ్‌ఎక్స్‌ వర్క్ అధికంగా ఉంటుందట. అలాగే పర్ఫెక్షన్, క్వాలిటీ కోసం టీమ్ ఈ సాంకేతికతను వాడుతున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు