సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ దబాంగ్ 3 తెలుగు ట్రైలర్ నిన్న విడుదల చేశారు. దబాంగ్ ప్రాంచైజ్ లో వస్తున్న దబాంగ్ 3 హిందీతో పాటు, తెలుగు,తమిళ కన్నడ భాషలలో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. దాదాపు మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ లో సల్మాన్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ మరియు యాక్షన్ తో హీటెక్కించారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో సుధీప్ విలన్ రోల్ చేయడం విశేషం. ఐతే ఈ దబాంగ్ మూవీ కి సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అని ట్రైలర్ చుస్తే అర్థం అవుతుంది.
సల్మాన్ చులబుల్ పాండే అనే రౌడీ పోలీస్ గా మారడం వెనుక కథను దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. కొత్త హీరోయిన్ సాయి మంజ్రేకర్ సల్మాన్ ఖాన్ ల మధ్య యంగ్ ఏజ్ లవ్ స్టోరీ, ఎమోషన్ డ్రామాగా ప్రభుదేవా చూపించాడు. సుదీప్ ఇష్టపడిన అమ్మాయి ప్రేమను సల్మాన్ సొంతం చేసుకోవడంతో వీరి మధ్య వైరం రగిలింది అని చెప్పొచ్చు. సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల అవుతుంది.


