దర్శకరత్న దాసరినారాయణరావు తన 151 వ సినిమాగా తమిళంలో హిట్ అయిన ‘మంజపై’ సినిమాని ‘ఎర్రబస్సు’ గా రీమేక్ చేసాడు. మంచి విష్ణు, కేథరిన్ ట్రేస హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా చిల్డ్రన్స్ కానుకగా నవంబర్ 14న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ రోజే ఈ సినిమాలోని చివరి పెండింగ్ సాంగ్ ని ఫినిష్ చేసుకొని ఇండియాకి రానున్నారు. ఇదిలా ఉంటే దాసరి నారాయణరావు మరో తమిళ సినిమా రీమేక్ కి సిద్దం అవుతున్నాడని సమాచారం.
అసలు విషయంలోకి వెళితే 2013లో చాలా చిన్న సినిమాగా వచ్చితమిళం, మలయాళంలో పెద్ద హిట్ అయిన సినిమా ‘నేరం’. నేరం అంటే టైం అని అర్థం. ఈ సినిమాని దాసరి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో దాసరి కుమారుడైన దాసరి అరుణ్ కుమార్ ని హీరోగా ఎంచుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే


