మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “పెద్ది”. భారీ అంచనాలతో ఈ వేసవిలో బిగ్గెస్ట్ సినిమాగా వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ఇదే కాగా దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం తాలూకా థియేట్రికల్ ట్రైలర్ కోసం అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా దీనిపై ఫైనల్ గా సాలిడ్ అప్డేట్ ఇపుడు వినిపిస్తుంది.
లేటెస్ట్ టాక్ ప్రకారం పెద్ది ట్రైలర్ ని మేకర్స్ ఈ మే 16న లాంచ్ చేయడానికి ఫిక్స్ చేశారట. అలాగే భోపాల్ వేదికగా గ్రాండ్ ఈవెంట్ తో ఈ కార్యక్రమాన్ని తాము చేయనున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ ఈవెంట్ లో ఏ ఆర్ రెహమాన్ తాలూకా స్పెషల్ లైవ్ ప్రోగ్రాం కూడా ఉంటుంది అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సో దీనిపై మేకర్స్ సైడ్ నుంచి అధికారిక క్లారిటీ ఒక్కటి ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ జూన్ 4న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.


