టాక్.. “ఇండియన్ 2” ఆడియో లాంచ్ డేట్ ఖరారు?

టాక్.. “ఇండియన్ 2” ఆడియో లాంచ్ డేట్ ఖరారు?

Published on Apr 30, 2024 1:01 PM IST

యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ హీరోగా కాజల్ (Kajal Aggarwal), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) అలాగే సిద్ధార్థ్ తదితరులు ముఖ్య పాత్రల్లో మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యి జూన్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ రిలీజ్ కి ముందు తమిళ నాట మేకర్స్ గ్రాండ్ ఆడియో లాంచ్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా రీసెంట్ గానే ఇంట్రెస్టింగ్ బజ్ వచ్చింది. ఇక దీనిపై మరింత క్లారిటీ ఇప్పుడు వినిపిస్తుంది. చెన్నైలో ఈ ఈవెంట్ మే 15న నిర్వహించనున్నారట. అలాగే ఈ వేడుకకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సూపర్ రజినీకాంత్ (Rajinikanth) లు ఇద్దరూ హాజరు కావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయని వినిపిస్తుంది.

ఇక దీనిపై అధికారిక క్లారిటీ తొందరలోనే రానుండగా రిలీజ్ డేట్ పై కూడా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు