కమ్ముల సినిమా కోసం ధనుష్ కి భారీ రెమ్యునరేషన్.?

Published on Jun 19, 2021 10:01 am IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరియు టాలీవుడ్ హ్యాపెనింగ్ ఫిల్మ్ మేకర్స్ శేఖర్ కమ్ముల కాంబో నుంచి నిన్ననే ఒక సాలిడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనౌన్స్ కాబడిన సంగతి తెలిసిందే. మొదట బజ్ కే మంచి అంచనాలు నెలకొన్నాయి. తర్వాత అధికారికంగా ప్రకటన రావడంతో ఆ అంచనాలు మరింత అయ్యాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ ఊహించని కాంబో నుంచి సినిమా అనడంతో ఎలా అయితే అంచనాలు ఓ రేంజ్ లో సెట్టయ్యాయో అందుకు తగ్గట్టుగానే ధనుష్ కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి వాటి ప్రకారం ఈ పాన్ ఇండియన్ సినిమాకు ధనుష్ 50 కోట్లు తీసుకుంటున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరి ఇందులో ఎంత మేర నిజముందో కానీ ఈ ప్రచారం మొదలైంది. ఇక ఈ చిత్రాన్ని లవ్ స్టోరీ నిర్మాతలు సహా ఆసియన్ గ్రూప్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం తెలుగు తమిళ్ మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :