ధనుష్ “రాయన్” వాయిదా?

ధనుష్ “రాయన్” వాయిదా?

Published on May 28, 2024 8:06 PM IST


కోలీవుడ్ స్టార్ హీరో అలాగే అక్కడ నుంచి గ్లోబల్ స్టార్ అయినటువంటి టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా ఇపుడు తెలుగు సహా తమిళ్ లో కూడా పలు చిత్రాలు చేస్తుండగా వీటిలో తన కెరీర్ బెంచ్ మార్క్ చిత్రం 50వ ప్రాజెక్ట్ ని తన స్వీయ దర్శకత్వం లోనే తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు అప్డేట్స్ సాంగ్స్ కూడా వచ్చాయి.

అలా ఈ జూన్ రిలీజ్ కి మేకర్స్ లాక్ చేయగా ఇప్పుడు ఈ సినిమా జూన్ నుంచి వాయిదా పడినట్టుగా లేటెస్ట్ రూమర్స్ వినిపిస్తున్నాయి. మేకర్స్ నుంచి ఇప్పుడు సడెన్ గా అప్డేట్స్ లాంటివి ఇవ్వడం ఆపారు. దీనితో అయితే ఈ సినిమా వాయిదా పడినట్టే కోలీవుడ్ వర్గాల్లో కూడా బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు సహా హిందీ భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు