బాలీవుడ్ నుంచి వచ్చిన రీసెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో దర్శకుడు ఆదిత్య ధర్ ఇంకా నటుడు రణ్వీర్ సింగ్ కలయికలో వచ్చిన సెన్సేషన్ చిత్రం ధురంధర్(Dhurandhar) కూడా ఒకటి. మరి ఈ సినిమా వచ్చి నెలన్నర దాటినా హవా మాత్రం ఇంకా తగ్గలేదు. దాదాపు మూడున్నర గంటలు ఉన్నప్పటికీ ఈ సినిమా రన్ కొనసాగుతూనే ఉంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పార్ట్ 2 మార్చ్ 19కి లాక్ అయ్యి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే దీనితో పలు సినిమాల క్లాష్ ఉంది కాని లేటెస్ట్ గా ధురంధర్ 2 వాయిదా అంటూ పలు రూమర్స్ వైరల్ గా మారాయి. మరి ఈ రూమర్స్ పై దర్శకుడు క్లారిటీ ఇచ్చేసారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ధురంధర్ 2(Dhurandhar 2) డేట్ మార్చ్ 19 నే అంటూ కన్ఫర్మ్ చేసి ఈ రూమర్స్ కి చెక్ పెట్టాడు. దీనితో ధురంధర్ 2 ఆన్ టైం వస్తుంది అని చెప్పొచ్చు. పార్ట్ 1 బాలీవుడ్ రికార్డులు తిరగరాసింది. మరి పార్ట్ 2 ఎలా ఉంటుందో చూడాలి.


