ఇండియన్ సినిమా దగ్గర పాత్ బ్రేకింగ్ సినిమాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే ఓజి డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన సెన్సేషనల్ హిట్ సినిమా “రోబో” కూడా ఒకటి. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రికార్డులు సెట్ చేసిన ఈ సినిమా బిగ్ స్క్రీన్స్ పై వండర్ఫుల్ ఎక్స్ పీరియన్స్ ని ఆడియెన్స్ కి అందించింది. తెలుగులో కూడా భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రీరిలీజ్ కోసం కూడా చాలా మంది ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు.
మరోసారి ఆ విజువల్ యాక్షన్ వండర్ ని విట్నెస్ చెయ్యాలని కొందరు, అప్పుడు మిస్ అయ్యాం ఈసారి చూడాలని మరికొందరు కోరుకున్నారు. అయితే ఫైనల్ గా వారికి గుడ్ న్యూస్ వచ్చేలానే ఉంది. అయితే ఈ సినిమా ప్రస్తుతానికి కేవలం తెలుగు రిలీజ్ మాత్రమే ఫిక్స్ చేసుకున్నట్టు వినిపిస్తోంది. బాహుబలి ది ఎపిక్ తరహాలోనే పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తే దీని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు కానీ దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు అలాగే కళానిధి మారన్ నిర్మాణం వహించారు.
