“హను మాన్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

“హను మాన్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

Published on Feb 18, 2024 12:00 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన టాలీవుడ్ ఫస్ట్ సూపర్ హీరో చిత్రం “హను మాన్”. మరి సాలిడ్ హైప్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఏకంగా 300 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి ఒక బిగ్గెస్ట్ హిట్ గా ఊహించని రికార్డులు సెట్ చేసింది. మరి మేకర్స్ మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఈ సినిమా లాంగ్ రన్ సినిమా గానే నిలిచింది.

దీనితో సుమారు రెండు నెలల మేర సమయాన్నే ఓటిటి రిలీజ్ కి తీసుకున్నారు మేకర్స్. అయితే ఇది వరకే ఈ చిత్రం ఓటిటి రిలీజ్ మార్చ్ నెల లోనే అని ఫిక్స్ అవ్వగా ఇపుడు డేట్ కూడా వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ మార్చ్ 2 నుంచే స్ట్రీమింగ్ యాప్ జీ 5 లో అందుబాటులోకి వస్తుంది అని టాక్. మరి దీనిపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి గౌర హరీష్ సెన్సేషనల్ మ్యూజిక్ ని అందించగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు