ప్రస్తుతం కోలీవుడ్ సినిమా దగ్గర అదిరే హైప్ ని సెట్ చేసుకున్న మాసివ్ చిత్రం “జైలర్”. మరి కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి నిన్న వచ్చిన ట్రైలర్ కట్ తో అయ్యితే అంతా ఒక్కసారిగా మారింది. అప్పటివరకు చాలా మందిలో కొద్దిగా ఎక్కడో డౌట్ ఉన్నప్పటికీ నెల్సన్ దానిని బ్రేక్ చేసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని డెలివర్ చేస్తున్నట్టుగా ఈ ట్రైలర్ తో అయితే కన్ఫర్మ్ అయ్యింది.
మరి ఈ చిత్రం హిట్ అనేది ఇప్పుడు ఈ సినిమా హీరో సహా నెల్సన్ కి కూడా చాలా కీలకం అని చెప్పాలి. లాస్ట్ టైం ఇద్దరు నుంచి వచ్చిన చిత్రాలు “పెద్దన్న” తమిళ్ లో అన్నాత్తే అలాగే నెల్సన్ చిత్రం “బీస్ట్” లు అనుకున్న రేంజ్ సక్సెస్ సాధించలేదు. దీనితో ఈ మెయిన్ పిల్లర్స్ ఇద్దరికీ కంబ్యాక్ అవసరంగా మారింది.
ఇక ట్రైలర్ చూసాక అయితే నెల్సన్ పై చాలా మందిలో నమ్మకం ఏర్పడింది. దీనితో డెఫినెట్ గా సాలిడ్ హిట్ పడే ఛాన్స్ గట్టిగా ఉందని ట్రైలర్ చూసిన తెలుగు ఆడియెన్స్ రజిని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో ఈ ఆగస్ట్ 10వరకు ఆగితే తెలిసిపోతుంది.
