గాడ్ ఆఫ్ వార్: ఎన్టీఆర్ లుక్ సిద్ధం చేసేశారా?

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో గాడ్ ఆఫ్ వార్ అనే మరో భారీ సబ్జెక్టు చేయనున్నాడు. అయితే ఈ సినిమా కూడా పూర్తిగా మరో ప్రపంచం కాగా ఈ చిత్రం తాలూకా సబ్జెక్టుని మరింత లోతుగా తారక్ ఎప్పుడు నుంచో అర్ధం చేసుకునే పనిలో ఉన్నాడు.

అయితే ఈ మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా గాడ్ వార్ నుంచి కూడా క్రేజీ ట్రీట్ వస్తుంది అనే టాక్ ఉంది కానీ లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ లీక్ బయటకి వచ్చింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ సిద్ధం చేసేశారా అంటే అవుననే అనుకునేలా సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ తన సోషల్ మీడియా స్టోరీలో పోస్ట్ చేసిన పిక్ వైరల్ గా మారింది.

అయితే ఇందులో తారక్ లుక్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంది కానీ ఇది గాడ్ వార్ కోసం సిద్ధం చేసిన లుక్ కాదు.. అసలు ఎన్టీఆర్ ఆ లుక్ లోనే లేడు. ఇది ఏఐ తో చేసిన ఫోటో కాగా దానిని థమన్ తనకి నచ్చి పోస్ట్ చేసుకున్నాడు. దీనితో ఈ పిక్ నిజమేనేమో అని కొందరు అభిమానులు భావిస్తున్నారు. కానీ కాదు. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ సినిమా లుక్ లోనే తారక్ కొనసాగుతున్నాడు.

Exit mobile version