“దేవర” ఫస్ట్ సింగిల్ రాబోతుందా!?

“దేవర” ఫస్ట్ సింగిల్ రాబోతుందా!?

Published on Apr 3, 2024 9:39 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” (Devara) కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని హాలీవుడ్ లెవెల్ హంగులతో మేకర్స్ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం నుంచి ఈరోజే ఓ సాలిడ్ అప్డేట్ ని యంగ్ హీరో విశ్వక్ సేన్ రివీల్ చేసాడు.

అంతే కాకుండా నిర్మాత నాగవంశీ, మరో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ వీరంతా కలిసి ఎన్టీఆర్ తో దిగిన పిక్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అంతా హడావుడిగా ఇప్పుడు మారిపోయింది. విశ్వక్ ఇచ్చిన అప్డేట్ తో దేవర ఆల్బమ్ అదిరిపోయింది అని కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇప్పుడు ఇదే క్రమంలో సినిమా అఫీషియల్ హ్యాండిల్ సహా సినిమా ఆడియో హక్కులు సొంతం చేసుకున్న టీ సిరీస్ వారు కూడా దేవర మ్యూజిక్ పై ఇంట్రెస్టింగ్ హింట్స్ ఇస్తున్నారు.

మరి ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే అవైటెడ్ ఫస్ట్ సింగిల్ (Devara First SIngle) వచ్చేలానే ఉందని చెప్పాలి. ఇక ఈ ట్రీట్ పై అఫీషియల్ క్లారిటీ ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఈ భారీ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ (Anirudh) సంగీతం అందిస్తుండగా ఫ్యాన్స్ ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు