“కేజీయఫ్ 2” బిగ్గెస్ట్ బ్యాటిల్ టార్గెట్ అప్పటికి.?

Published on Jul 7, 2021 3:28 pm IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మన దక్షిణాది నుంచి భారీ అంచనాలు నెలకొల్పుకున్న కొన్ని టాప్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల ఎప్పుడు అనే అంశంపై ఎప్పటి నుంచో ఆసక్తి నెలకొంది. అయితే నిన్ననే మేకర్స్ ఒక సాలిడ్ క్లారిటీ కూడా ఇచ్చారు.

రాకీ భాయ్ అందరూ థియేటర్స్ లో ఉన్నపుడు మాత్రమే ఎంట్రీ ఇస్తాడని చెప్పడంతో ఇక కొత్త రిలీజ్ డేట్ కి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కి కన్ఫర్మ్ అయ్యిపోయింది. మరి ఈ కొత్త డేట్ పై ఎప్పటి నుంచి కొత్త ఊహాగానాలు ఉన్నాయి. వాటి ప్రకారం బహుశా అక్టోబర్ లో ఉండొచ్చేమో అని బజ్ వచ్చింది కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం మాత్రం ఈ చిత్రం డిసెంబర్ క్రిస్మస్ రేస్ లోకి షిఫ్ట్ అయ్యిందని సమాచారం. ఇప్పటికే ఆ టైం కి మరిన్ని భారీ సినిమాలు కూడా టార్గెట్ పెట్టుకుంటున్నాయి. సో అప్పటి బిగ్గెస్ట్ బ్యాటిల్ గట్టిగానే ఉంటుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :