తన కెరీర్ ఆరంభంలో చేసిన రెండు సినిమాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నుంచి రీసెంట్ గా వచ్చిన కొత్త చిత్రం ‘కింగ్డమ్’ దారుణంగా డిజప్పాయింట్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత తన నుంచి రానున్న తదుపరి చిత్రం ‘మ్యాజిక్’ మాత్రం నేరుగా ఓటిటిలో విడుదల అవుతుంది అని ఇపుడు టాక్ మొదలైంది.
నిజానికి కింగ్డమ్ కంటే ముందే రావాల్సిన ఈ మ్యూజికల్ చిత్రం అలా కొన్నాళ్ల నుంచి హోల్డ్ లోనే ఉంది. ఆ మధ్య థియేట్రికల్ రిలీజ్ కి కూడా కన్ఫర్మ్ చేశారు కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం మాత్రం ఈ సినిమా డైరెక్ట్ ఓటిటి లోనే విడుదల అవుతుందట. మరి ఆ ఓటిటి సంస్థ ఏంటి? ఎప్పుడు విడుదల చేస్తారు అనే ఇతర వివరాలు బయటకి రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో ధురంధర్ బ్యూటీ సారా అర్జున్ తదితర యువ తారాగణం నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. సో ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఉన్నారు. సో ఈ క్రేజీ కాంబినేషన్ విడుదల ఎప్పుడు అనేది చూడాలి.


