మహేష్ కోసం కొరటాల శివ నిర్మాతగా మారనున్నాడా?

Published on May 29, 2019 1:48 pm IST

మహేష్, కొరటాల శివది హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి చేసిన “శ్రీమంతుడు, “భరత్ అనే నేను”బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తా చాటాయి. మహేష్ తన నెక్స్ట్ మూవీని “ఎఫ్2” తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఈ నెల 31న పూజాకార్యక్రమాలు పూర్తి చేసుకొని, జూన్ 26 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

దీనితో పాటు గీత గోవిందం డైరెక్టర్ పరుశురామ్ మహేష్ కి ఓ కథ వినిపించగా మహేష్ దానికి సానుకూలంగా స్పందించారంట. . ఈ ప్రాజెక్ట్ ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నారని సమాచారం.ఐతే పరుశురాం మూవీపై ఆసక్తి చూపిస్తున్న కొరటాల శివ తన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తో కలిసి సుధా ఆర్ట్స్ లో ఈ ప్రాజెక్టును నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో వినబడుతున్న టాక్. మరి మహేష్-పరుశురాం ల ఈ క్రేజీ మూవీ ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More