విభిన్న చిత్రాల దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి దర్శకుడు పూర్తిగా కొత్త నటీనటులతో జెంజ్ బ్యాచ్ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఐతే, ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ను మళ్ళీ రీషూట్ చేయాలని క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ కాపీ చూశాక, క్లైమాక్స్ ఆయన అనుకున్నట్టుగా లేదట.
అందుకే, అవుట్ ఫుట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ ను మళ్లీ రీషూట్ చేయాలని క్రిష్ ఫిక్స్ అయ్యాడట. అన్నట్టు ఈసారి కమర్షియల్ అంశాలతో పాటు భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తూ తనదైన శైలిలో క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. నిజానికి స్టార్ హీరోల కంటే కథను నమ్మే దర్శకుడిగా క్రిష్ కి మంచి పేరు ఉంది. అందుకే, మరోసారి కొత్త ప్రతిభను పరిచయం చేస్తూ ప్రత్యేకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
