ఆసెంటిమెంట్ కలిసొస్తే మహేష్ కి భారీ హిట్ పడ్డట్టే

ఆసెంటిమెంట్ కలిసొస్తే మహేష్ కి భారీ హిట్ పడ్డట్టే

Published on Sep 28, 2019 3:18 PM IST

mahesh2

మహేష్ తన కెరీర్లో ఇప్పటికి చేసింది 25చిత్రాలు. ఆచితూచి సినిమాలు చేసే మహేష్ సంవత్సరానికి ఒక చిత్రం కంటే ఎక్కువ చేయరు. ఆయన చేస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరూ 26వ చిత్రంగా తెరకెక్కుతుంది. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం తరువాత మహేష్ సరిలేరు నీకెవ్వరూ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. వెంకటేష్ తో కలిసి మహేష్ చేసిన ఈ మల్టీస్టారర్ మంచి విజయాన్ని నమోదు చేసింది.

ఇన్నేళ్ల మహేష్ కెరీర్లో సంక్రాంతి బరిలో దిగింది కేవలం ఐదు సార్లే. మొట్టమొదటి సారిగా ఆయన జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన టక్కరి దొంగ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ చిత్రం మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఐతే ఆ చిత్రం విడుదలైన రెండేళ్లకు 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సంక్రాంతి కి విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆతరువాత 2013లో పూరి తెరకెక్కించిన బిజినెస్ మెన్ చిత్రం కూడా సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది.2014లో సుకుమార్ తెరకెక్కించిన వన్ నేనొక్కడినే మాత్రం అనుకున్న స్థాయి విజయం సాధించలేదు.

ఇలా ఇప్పటికి మహేష్ సంక్రాంతి సినిమాలలో రెండు సూపర్ హిట్లు, ఒక బ్లాక్ బస్టర్ హిట్ రెండు యావరేజ్ సినిమాగా నిలిచాయి. మొత్తంగా చూస్తే సంక్రాంతి మహేష్ కి కలిసొన్చినట్లే లెక్క. మరి 2020సంక్రాంతి కి సరిలేరు నీకెవ్వరూ మూవీతో మహేష్ ఏ స్థాయి హిట్ అందుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు