పాన్ ఇండియన్ ఫ్లిక్ గా “సర్కారు వారి పాట” కన్ఫర్మేనా.?

పాన్ ఇండియన్ ఫ్లిక్ గా “సర్కారు వారి పాట” కన్ఫర్మేనా.?

Published on Jan 19, 2021 12:00 PM IST

ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాల్లో ఎక్కువగా మన తెలుగు సినిమాలే కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు మన స్టార్ హీరోలు అంతా పాన్ ఇండియన్ మార్కెట్ పై కన్నేశారు. మరి అయితే ఎంతో పెద్ద స్టార్డం ఉండి ఇంకా పాన్ ఇండియన్ మార్కెట్ జోలికి వెళ్లండి ఎవరన్నా ఉన్నారు అంటే అది సూపర్ స్టార్ మహేష్ అనే చెప్పాలి.

ఇంటర్నేషనల్ లెవెల్ కటౌట్ తో తెలుగు సినిమాలతో పాటుగా మరిన్ని అత్యున్నత స్థాయి సినిమాలు చెయ్యాలని మహేష్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మరి ఎట్టకేలకు మహేష్ పాన్ ఇండియన్ ఎంట్రీ పై ఓ క్లారిటీ గత కొన్నాళ్ల నుంచి గట్టిగానే వినిపిస్తుంది. అదే పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట” విషయంలో..

ఈ సాలిడ్ చిత్రాన్ని పాన్ ఇండియన్ ఫ్లిక్ గా విడుదల చేస్తారని రూమర్స్ వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్ ప్రముఖ నటుడు అనీల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తాడని టాక్ వచ్చింది. ఇప్పుడు అది మరింత బలపడింది. సో ఖచ్చితంగా ఈ చిత్రం కూడా పాన్ ఇండియన్ రిలీజ్ కు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి.

మరి ఇదే కనుక సరిగ్గా ప్లాన్ చేసినట్టయతే రాజమౌళితో చేసే సినిమా అలాగే మహేష్ తర్వాత సినిమాలకు తొలి అడుగు ఇక్కడ నుంచే పడ్డట్టు అవుతుంది అని చెప్పొచ్చు. మరి ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటెర్టైన్మెంట్స్ వారు మరియు మహేష్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు