భారీ ఆఫర్ అందుకున్న మీనాక్షి చౌదరి?

భారీ ఆఫర్ అందుకున్న మీనాక్షి చౌదరి?

Published on Mar 5, 2024 7:01 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ లో మీనాక్షి చౌదరి కూడా ఒకరు. అయితే మీనాక్షి మొదటి సినిమానే నిరాశ అయినప్పటికీ టాలీవుడ్ మంచి ఆఫర్స్ ఆమెకు వచ్చాయి. అలాగే రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం లో కూడా ఆమె అవకాశం దక్కించుకుంది. కానీ ఇవేవీ మీనాక్షి ఫాలోవర్స్ కి కిక్ ఇవ్వలేదు.

మెయిన్ గా గుంటూరు కారంలో ఆమె రోల్ తో అయితే బాగా డిజప్పాయింట్ అయ్యారు కూడా. మరి ఇప్పుడు ఫైనల్ గా మీనాక్షి చౌదరికి భారీ ఆఫర్ వచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీని ప్రకారం కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి దళపతి విజయ్ సినిమాలో ఈమె నటించే అవకాశం అందుకున్నట్టుగా ఇప్పుడు వినిపిస్తోంది.

విజయ్ 69 కోసమిప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఆమె ఇందులో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది అని ఇప్పుడు రూమర్స్ మొదలయ్యాయి. అయితే అసలు దర్శకుడు ఎవరు? నిర్మాణం ఎవరు అనేది కూడా క్లారిటీ లేకుండా హీరోయిన్ పేరు ఖరారు అయ్యిందని వస్తున్న టాక్ ఎంతవరకు నిజం అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు