క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదా?

క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదా?

Published on Jul 31, 2026 7:01 AM IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా సర్దార్ కూడా ఒకటి. గత కొన్నేళ్ల కితం విడుదల అయ్యిన ఈ సినిమాకి భారీ సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేసారు. అయితే ఇదెప్పుడు వస్తుందా అని కోలీవుడ్ సహా తెలుగు ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మేకర్స్ సెప్టెంబర్ 10 డేట్ కి లాక్ చేశారు.

కానీ లేటెస్ట్ గా సర్దార్ 2 నుంచి నేడు మరో కొత్త అప్డేట్ వస్తుందని నిన్న విడుదల చేసిన పోస్టర్ లో ఎలాంటి డేట్ ని పెట్టకపోవడం వైరల్ గా మారింది. కొత్త డేట్ కి ఏమన్నా సినిమా షిఫ్ట్ అవుతుందా అని చాలా మంది అనుకుంటున్నారు కానీ డేట్ లో అయితే ఎలాంటి మార్పు లేదు అనే టాక్. సో పాన్ ఇండియా లెవెల్లో సర్దార్ 2 సెప్టెంబర్ 10నే రాబోతున్నాడు. కానీ ఈ అప్డేట్ ఏంటి అనేది మరికాసేపట్లో రివీల్ కానుంది.

తాజా వార్తలు