‘ది ప్యారడైజ్’ ట్రైలర్ రూమర్స్ లో నిజం లేదా!

‘ది ప్యారడైజ్’ ట్రైలర్ రూమర్స్ లో నిజం లేదా!

Published on Sep 11, 2026 7:00 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ది ప్యారడైజ్ కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ చిత్రం విడుదల ఇప్పుడు దగ్గరకి వచ్చేస్తోంది.

ఇక మేకర్స్ కూడా వరుస అప్డేట్స్ తో సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కబాలి స్టైల్ లో నాని సినిమా కూడా ఎలాంటి ట్రైలర్ లేకుండా వస్తుంది అని పలు రూమర్స్ ఇప్పుడు సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది అవాస్తవం అని తెలుస్తుంది. ట్రైలర్ కట్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నట్టుగా టాక్.

సో ప్యారడైజ్ నుంచి ట్రైలర్ లేకుండా వచ్చే ఛాన్స్ లేదు. సినిమాపై హైప్ అయితే ఉంది కానీ దాన్ని పెంచాలి అంటే ట్రైలర్ ఖచ్చితంగా రావాల్సిందే. అది లేకుండా రిలీజ్ అంటే ఇది వరకు అంచనాలు పెట్టుకున్న జెనరల్ ఆడియెన్స్ లో ఒపీనియన్ మారే ఛాన్స్ కూడా ఉంది. సో దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు