ఎన్టీఆర్ సినిమాకు రేడియేషన్ కి ఏంటి లింకు?

Published on Jun 4, 2020 4:46 pm IST

ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ మూవీ అధికారికమే అని తెలుస్తుంది. మే 20న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ ట్వీట్ వేయగా, దానికి కొనసాగింపుగా మైత్రి మూవీ మేకర్స్ మరో ట్వీట్ వేశారు. దీనితో ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31వ చిత్రం కన్ఫర్మ్ అని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు ట్వీట్స్ లో రేడియషన్ అనే పదం ఉపయోగించారు. ఎన్టీఆర్ న్యూక్లియర్ ప్లాంట్, దానిని ఎదుర్కోవడానికి నేను రేడియేషన్ సూట్ లో వస్తాను.. అని ప్రశాంత్ నీల్ అంటే, నేడు మైత్రి మూవీ మేకర్స్ త్వరలో రేడియేషన్ సూట్ లో కలుద్దాం అని ట్వీట్ చేశారు.

వీరిద్దరి ట్వీట్స్ లో కామన్ గా ఉన్న రేడియేషన్ అనే పదంలో ఈ మూవీ కథ లేదా టైటిల్ కి సంబంధించి ఎదో హింట్ ఉందని కొందరు భావిస్థున్నారు. కావాలనే సినిమా గురించి నిగూఢంగా ఎదో తెలియజేస్తున్నారని అనిపిస్తుంది. మరి ఈ విషయాలన్నిటిపై స్ఫష్టత రావాలంటే ఏడాది పైగా వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :

More