ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విశాల్ “రత్నం”!?

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విశాల్ “రత్నం”!?

Published on May 22, 2024 9:01 AM IST

అటు తమిళ్ లో అలాగే మన తెలుగులో కూడా మంచి ఫేమ్ ఉన్న అతి కొద్ది మంది హీరోస్ లో కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కూడా ఒకడు. మరి విశాల్ హీరోగా దర్శకుడు హరి కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ హ్యాట్రిక్ సినిమానే “రత్నం”. అయితే హ్యాట్రిక్ సినిమా అయినప్పటికీ పెద్ద బజ్ లేకుండానే ఈ సినిమా వచ్చింది. అలాగే చాలా యావరేజ్ పెర్ఫామెన్స్ ని తెలుగు సహా తమిళ్ లో చేసింది.

దీనితో ఇది కూడా విశాల్ కెరీర్ లో ప్లాప్ గానే నిలిచిపోగా ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నట్టుగా వినిపిస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ సినిమా ఈ మే 24 నుంచే తెలుగు, తమిళ భాషల్లో రానుంది అని లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా జీ స్టూడియోస్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు