పవన్ మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్?

పవన్ మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్?

Published on Jan 20, 2024 4:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అవన్నీ కూడా ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ లైనప్ ఇప్పుడు ఉండడంతో పవన్ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ సినిమాల్తో పాటుగా పవన్ ఇప్పుడు మరో సినిమా ఓకే చేసినట్టుగా కొన్ని రూమర్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి.

అయితే ఇప్పుడు పవన్ రెండు స్ట్రైట్ సినిమాలు చేస్తుండగా వాటిలో ఒకటి రీమేక్ ఉంది. ఇక ఇది కాకుండా మరో రీమేక్ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అనే టాక్ ఇప్పుడు మొదలైంది. అది కూడా కోలీవుడ్ యంగ్ దర్శకుడు అట్లీతో పవన్ సినిమా చేయనున్నాడని కొన్ని రూమర్స్ మొదలయ్యాయి. ఇక ఇందులో ఇందులో త్రివిక్రమ్ పేరు కూడా వినిపిస్తుండడంతో అట్లీ చేసిన సినిమాల్లోనే ఒకటి తెలుగులో తీస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు