“పెద్ది”పై మళ్లీ షాకింగ్ రూమర్స్! మళ్లీ మిస్టేక్ చేస్తున్నారా?

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న సాలిడ్ సినిమానే పెద్ది. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా నిజానికి ఈ మార్చ్ 27నే విడుదల కావాల్సి ఉంది కాని ఓ నెల వెనక్కి వాయిదా వేశారు. ఇక ఈ కొత్త డేట్ గా ఏప్రిల్ 30న గ్రాండ్ గా విడుదలకి ఫిక్స్ చేశారు. అయితే పెద్ది ఈ డేట్ లో కూడా రాదు అన్నట్టు మరోసారి షాకింగ్ రూమర్స్ మొదలయ్యాయి.

దీనితో మెగా అభిమానుల్లో మరోసారి కలవరం మొదలైంది. ఆల్రెడీ ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. మళ్లీ వాయిదా.. అందులో ఇంకా దూరంగా వెళుతుంది అంటే సినిమాపై ఉన్న హైప్ కి కూడా దూరం పెంచినట్టే అవుతుంది. ఎంత వీలైతే అంత త్వరగా సినిమా విడుదల చేసుకోవడమే మంచిది. ఎంత హైప్ ఉన్న సినిమాలు అయినా ఆన్ టైం రాకపోతుంటే వాటి ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. సో మేకర్స్ ఇలాంటి మిస్టేక్ లు చేయకుండా ఉంటేనే బెటర్.

Exit mobile version