“కల్కి” లో ప్రభాస్ ద్విపాత్రాభినయం?

“కల్కి” లో ప్రభాస్ ద్విపాత్రాభినయం?

Published on Apr 28, 2024 11:08 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా, దిశా పటాని ల కలయికలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సెన్సేషనల్ పాన్ వరల్డ్ చిత్రం “కల్కి 2898ఎడి”. మరి దీనిపై భారీ అంచనాలు నెలకొనగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రిలీజ్ డేట్ అప్డేట్ ని మేకర్స్ ఫైనల్ గా నిన్న రివీల్ చేశారు.

అయితే నిన్న పోస్టర్ లో ప్రభాస్ లుక్ కి ఫ్యాన్స్ ఇంప్రెస్ అవ్వగా ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ కి గతంలో వచ్చిన మరో లుక్ కి భేదాలు చూస్తున్నారు. దీనితో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా కొందరు అనుకుంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ప్రభాస్ పలు భిన్నమైన గెటప్స్ లో కనిపించవచ్చు తప్ప తాను రెండు పాత్రలు అయితే చేయడం లేదని తెలుస్తుంది.

సో ఈ విషయంలో అభిమానులు కాస్త తక్కువ అంచనాలు పెట్టుకుంటే మంచిది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం జూన్ 27న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు