వైరల్: ప్రభాస్ పోస్ట్ ఈ హీరోయిన్ తో లింకప్ యాదృచ్చికమేనా!?

వైరల్: ప్రభాస్ పోస్ట్ ఈ హీరోయిన్ తో లింకప్ యాదృచ్చికమేనా!?

Published on May 17, 2024 2:03 PM IST

తాజాగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ అభిమానుల్లో ఎలాంటి హీట్ ని జెనరేట్ చేసి పారేసిందో చూసాం. దీనితో అసలు ప్రభాస్ ఎవరి కోసం దేని కోసం చెప్పాలి అనుకున్నాడో అని ఆసక్తి మొదలైంది. ఇక ఇంకో పక్క ఓ ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను అని హింట్ ఇవ్వడంతో ప్రభాస్ తన లైఫ్ పార్ట్నర్ కోసం కానీ అనౌన్స్ చేయబోతున్నాడా అనే ఉత్సుకత కూడా మరోపక్క మొదలైంది.

మరి ఇప్పుడు ఇదే పోస్ట్ తో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రీసెంట్ గా “మంగళవారం” చిత్రంతో మెప్పించిన నటి పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ఇవాళ ఉదయం పన్నెండున్నర సమయంలో పెట్టిన పోస్ట్ తో సంబంధం ఉన్నట్టుగా వైరల్ గా మారింది. ప్రభాస్ ఏమో డార్లింగ్స్ అంటూ పోస్ట్ స్టార్ట్ చేసాడు అలాగే పాయల్ ఏమో నేను ఖచ్చితంగా ఎవరొకరి డార్లింగ్ అవుతాను ఏమన్నా గెస్ చేస్తారా అంటూ పోస్ట్ చేసింది.

కామన్ గా డార్లింగ్ అనే పాయింట్ రావడం ఆ పోస్ట్ కి ఈ పోస్ట్ కి ఎక్కడో పొంతన కుదురుతుంది అనేది వైరల్ గా మారింది. దీనితో అభిమానుల్లో మరింత టెన్షన్ మొదలైంది. మరి ఈ ఇద్దరి పోస్ట్ లు కేవలం యాదృచ్చికమేనా లేక ఏదన్నా సినిమా సంబంధించి ప్రమోషన్ లాంటిది ప్లాన్ చేసారా అనేది కొంచెం ఆగి చూస్తే తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు