హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘స్వయంభు’. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పిరియాడికల్ మైథలాజిక్ చిత్రంగా ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమా పై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశారట. ఈ సాంగ్ కోసం కన్నప్ప ఫేమ్ ‘ప్రీతి ముకుందన్’ కనిపించబోతుందని తెలుస్తోంది. మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ప్రీతి ముకుందన్.
మరి నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభు’తో ప్రీతి ముకుందన్ ఎలాంటి ముద్ర వేస్తోందో చూడాలి. ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పిక్సెల్ స్టూడియోస్ ఆధ్వర్యంలో భువన్ మరియు శ్రీకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు, నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాని సమర్పిస్తున్నారు.
