“పుష్ప 2” ఆల్బమ్ నేషన్ ని షేక్ చేస్తుందా?

“పుష్ప 2” ఆల్బమ్ నేషన్ ని షేక్ చేస్తుందా?

Published on Apr 24, 2024 7:04 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప 2”. మరి పాన్ ఇండియా సినిమా దగ్గర ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న సీక్వెల్ ఇది కాగా రీసెంట్ గానే ఈ సినిమాకి ఊహించని స్థాయి బిజినెస్ అవుతున్నట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. అయితే పుష్ప 1 నేషనల్ వైడ్ గా ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది అందరికీ తెలుసు.

మెయిన్ గా అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ ల కాంబినేషన్ కి ఉండే అంచనాలు ఇది అందుకొని పాటలతోనే నేషనల్ లెవెల్లో అదరగొట్టింది. ఇక ఇప్పుడు ఫైనల్ గా పుష్ప 2 మొదటి పాట రాబోతుంది. మరి ఇక్కడ నుంచి మరోసారి ఈ ఆల్బమ్ నేషనల్ లెవెల్లో సెన్సేషన్ గా మారుతుందో లేదో వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు నటిస్తున్నారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఆగస్ట్ 15న గ్రాండ్ రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు