ఓటిటిలో “పుష్ప 2” ఆల్ టైం రికార్డు డీల్..!?

ఓటిటిలో “పుష్ప 2” ఆల్ టైం రికార్డు డీల్..!?

Published on Apr 18, 2024 3:35 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” (Pushpa 2) కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాకి సెన్సేషనల్ బిజినెస్ అయ్యితే ఇప్పుడు నడుస్తుంది. తాజాగా నార్త్ హక్కులే సుమారు 200 కోట్లకి అమ్ముడుపోయిన వార్తలు కేజ్రీగా మారగా ఇప్పుడు పుష్ప 2 ఓటిటి (Pushpa 2 OTT Deal) డీల్ పై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం పుష్ప 2 ట్టాల్టోటల్ ఓటిటి హక్కులని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు భారీ మొత్తంలో 275 కోట్ల డీల్ తో పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ మొత్తం అయితే ఇండియా లోనే అత్యధికం అన్నట్టుగా వినిపిస్తుంది. దీనికి ముందు “రౌద్రం రణం రుధిరం” ఆల్ టైం రికార్డు ఉండగా దానిని ఇప్పుడు పుష్ప 2 తో అల్లు అర్జున్ బ్రేక్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి మొత్తానికి అయితే పుష్ప 2 పై ఉన్న క్రేజ్ మాములు లెవెల్లో లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో రష్మికా హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్, ఫహద్ ఫాజిల్ అలాగే అనసూయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తుండగా ఈ ఆగస్ట్ 15న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు