ఆ స్పెషల్ డే కే “రాధే శ్యామ్” టీజర్.?

Radhe Shyam 3

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ టీజర్ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే.

కానీ అనుకున్న సమయానికి అయితే పలు కారణాల చేత ఆ టీజర్ రాలేదు. మరి ఇదిలా ఉండగా కాస్త సీజీ వర్క్ పెండింగ్ ఉండడం మూలాన ఈ సినిమా టీజర్ లేట్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది.

మరి ఈ టీజర్ ను ఇంతకు ముందు మేము చెప్పినట్టుగానే ప్రపంచ ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14 నే రానున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ భారీ చిత్రం టీజర్ అప్పుడే వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వాలారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version