తలైవర్ తో తారక్ పోటీ?

తలైవర్ తో తారక్ పోటీ?

Published on Apr 13, 2024 8:01 AM IST

ఈ ఏడాదిలో మన సౌత్ ఇండియా సినిమా నుంచి పలు భారీ చిత్రాలే రాబోతున్నాయి. మరి వీటిలో మన తెలుగు నుంచే కాకుండా తమిళ్ నుంచి కూడా పలు క్రేజీ ప్రాజెక్ట్ లే ఉండగా వాటిలో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రం “వేట్టైయాన్” (Vettaiyan) కూడా ఒకటి. దర్శకుడు జ్ఞ్యానవేల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం రిలీజ్ ని మేకర్స్ రీసెంట్ గానే అక్టోబర్ అంటూ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

డేట్ అయితే ఇంకా రివీల్ చేయలేదు కానీ లేటెస్ట్ బజ్ మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) తో క్లాష్ ఉంటుంది అన్నట్టుగా వినిపిస్తుంది. లేటెస్ట్ గా ప్రకారం “దేవర” (Devara), “వేట్టైయాన్” ల నడుమ క్లాష్ ఉండబోతుంది అని వినిపిస్తుంది. దేవర ఆల్రెడీ అక్టోబర్ 10న డేట్ ని ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ డేట్ లోనే లేదా దగ్గరగా తలైవర్ కూడా వస్తారని వినిపిస్తుంది. మరి చూడాలి ఈ బిగ్గెస్ట్ క్లాష్ పడుతుందో లేదో అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు