టాక్.. బాబాయ్ డేట్ లోకి చరణ్ “గేమ్ చేంజర్”?

టాక్.. బాబాయ్ డేట్ లోకి చరణ్ “గేమ్ చేంజర్”?

Published on May 4, 2024 8:00 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి మాంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న చిత్రాల్లో మెగా కుటుంబ హీరోల నుంచి రానున్న పలు భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. మరి వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాలు “ఓజి”, “హరిహర వీరమల్లు” కూడా ఒకటి కాగా ఈ చిత్రాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రాల్లో ఓజి కి ఆల్రెడీ సెప్టెంబర్ 27 డేట్ లాక్ అయ్యింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ డేట్ లో సినిమా అనుమానమే అంటూ కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ డేట్ లోకి అబ్బాయ్ రామ్ చరణ్ వస్తాడు అన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఓజి కానీ ఈ డేట్ లో రావడం సాధ్యపడకపోతే శంకర్ తో గ్లోబల్ స్టార్ చేస్తున్న భారీ చిత్రం “గేమ్ చేంజర్” వస్తుందట.

అయితే ఇదంతా ఓజి కి జరిగే ఓటిటి డీల్ ని బట్టి ఉంటుంది అని బజ్. అయితే సెప్టెంబర్ కి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోపు ఓటిటి డీల్ పూర్తి అయిపోవచ్చు సో దాదాపు సెప్టెంబర్ రిలీజ్ కే వస్తుంది. ఒకవేళ మిస్ అయితే ఈ డేట్ లో గేమ్ చేంజర్ పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు