“ఈగల్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్?

“ఈగల్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్?

Published on Feb 25, 2024 2:01 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా “ఈగల్” కోసం తెలిసిందే. మరి మాస్ అండ్ యాక్షన్ మూవీ లవర్స్ మన టాలీవుడ్ నుంచి ఒక బెస్ట్ అవుట్ ఫుట్ ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం నిలవగా ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కి సంబంధించి మరో అప్డేట్ బయటకి వచ్చింది.

రీసెంట్ గానే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ ఈటీవీ విన్ వారు సొంతం చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ కాగా ఇప్పుడు డేట్ ఎప్పుడు అనేది తెలుస్తుంది. దీనితో ఈగల్ చిత్రం మార్చ్ 2న అయితే స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి డేవ్ జాండ్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు. అలాగే యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్ర ఈ చిత్రంలో పోషించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు